Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్యాకేజీలు కాదు... తెలంగాణే కావాలి: కోదండరాం

పది జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే కావాలి తప్ప, ప్రత్యేక ప్యాకేజీలు అవసరం లేదని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఇప్పటికైనా తెలంగాణ విషయాన్ని తేల్చాలని కోరారు. మరోవైపు తెలంగాణకు ప్యాకేజీలు ఆమోదనీయం కాదని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటునే తాము కోరుకుంటున్నామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. సమస్యకు ఇదే పరిష్కారమన్నారు. ప్యాకేజీల వల్ల సమస్యలు మరింత పెరుగుతాయని మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు.

More Telugu News